తెలంగాణ ముఖ్యమంత్రి, శిష్యుడు రేవంత్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా..? ప్రజాభవన్ వేదికగా జరిగిన భేటీ విఫలమైందా..? మరుసటి రోజే ఎన్టీఆర్ భవన్ వేదికగా స్వీట్ వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? మనతో పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవని పదే పదే చంద్రబాబు ఎందుకన్నారు..? బాబు మనసులోని మాట బయటికొచ్చేసిందా..? అంటే బాబు ప్రసంగాన్ని బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ బాబు ఏమన్నారు..? అసలేం జరిగింది..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
నిన్న అలా..!
వారం, పది రోజులుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గురు శిష్యులు కలవబోతున్నారన్న వార్తలు ఏ రేంజ్‌లో హడావుడి జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రజాభవన్ వేదికగా సమావేశం అయితే జరిగింది. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీలో విభజన అంశాలు మొదలుకుని బకాయిలు, ఇచ్చి పుచ్చుకోవాల్సినవి.. భద్రాచలం మండలాలు రిటర్న్ ఇవ్వాలని ఇలా చాలా అంశాలపైనే ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇందులో చంద్రబాబు కొన్ని అడగ్గా.. మారుమాట లేకుండానే రేవంత్ నో చెప్పేశారు..! రేవంత్ అడిగినవి కూడా చంద్రబాబు మొహమాటం లేకుండా శిష్యుడి అని కూడా చూడకుండా సమస్యే లేదనేశారు..! ఇవన్నీ గత 24 గంటలుగా మీడియా, సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని చానెళ్లలో చర్చలు సక్సెస్ అని కలిసి ముందుకెళ్దామని రాగా.. మరికొన్ని ఊరించి.. ఉసూరుమనిపించారని చెప్పేశాయి..!
ఇంతలో ఏమైంది..?
ఇద్దరు సీఎంల భేటీ అయ్యి.. సరిగ్గా 24 గంటలు కూడా గడువక ముందే ఎందుకో చంద్రబాబు ఒక్కసారిగా ప్లేట్ మార్చేశారు. ఎంతలా అంటే.. ఎన్టీఆర్ భవన్ వేదికగా రేవంత్ రెడ్డికి గట్టిగా ఇచ్చిపడేశారు. సక్రమంగా ఉంటే సరే లేకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని.. రేవంత్ పేరు ఎత్తకుండానే ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు బాబు. పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే.. అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకుందాం. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు నాకు తెలుసు. విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వారిదే. అభివృద్ధి కోసం ఐక్యమత్యంతో పని చేద్దాం.. అని చంద్రబాబు ఈ సభావేదికగా చెప్పుకొచ్చారు. చూశారు కదా.. ఈ మాటలను ఎవర్ని ఉద్దేశించి అన్నారో..? ఏ పరిస్థితుల్లో అన్నారో అర్థమైంది కదూ..! గొడవలు వద్దని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఎలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారన్న మాట. ఇవన్నీ ఒక ఎత్తయితే తెలంగాణ అనే మాట చంద్రబాబు నోట చాలా అరుదుగా వస్తుంటుంది.. అలాంటిది జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.