ఈమధ్యన సమంత ఇస్తున్న హెల్త్ టిప్స్ పై ఓ డాక్టర్ రియాక్ట్ అవడం కాదు.. తన ఫాలోవర్స్ కి తప్పుడు సంకేతాలిస్తున్న సమంతని జైల్లో పెట్టాలంటూ చేసిన పోస్ట్ తో జైల్లో పెట్టినా పర్వాలేదు నేను మాత్రం ఇలానే చెబుతానంటూ సమంత ఆ డాక్టర్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. సమంత పై డాక్టర్ చేసిన కామెంట్స్ కి చాలామంది సమంత కి సపోర్ట్ గా నిలిచారు.
మాయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ కోలుకుంటున్న సమంత చాలా రోజులుగా తాను ఫాలో అవుతున్న హెల్త్ టిప్స్ ని ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ వస్తుంది. అయితే తాను సమంత విషయంలో అలా రియాక్ట్ అవడం తప్పే, సమంతకి సారి చెబుతున్నాను. కానీ ఈ విషయంలో సమంత తప్పేమి లేకపోయినా.. ఆమెకి వైద్యం చేసిన డాక్టర్ దే అసలు తప్పు. నేను ఖండించిన తీరు సమంతకి నచ్చలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అర్ధం చేసుకున్నాను. నేను కావాలని చెయ్యలేదు, పొరబాటున అనేశాను.
అసలు ఇందులో సమంత తప్పేమి లేదు.. ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దే తప్పు. సమంత కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పై పలు కేసులు ఉన్నాయి. అతను అసలు ఎంబిబిఎస్ చదవలేదు. అతనొక ప్రకృతి వైద్యుడు. ప్రజల ఆరోగ్యానికి హనికరమైన ఉత్పత్తులు ప్రోత్సహించినందుకు అతనిపై కేసులు పెట్టారు. నేను కూడా ఆ డాక్టర్ చెప్పిన వైద్యాన్ని ఖండించాను అంతే తప్ప సమంత ని ఏమి అనలేదు అంటూ ఆమెకి క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టాడు సదరు డాక్టర్.