కల్కి 2898 AD చిత్రం జూన్ 27 విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. రెండో వారంలోకి ఎంటర్ అయినా ఇప్పటికి కల్కి థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. మేకర్స్ కూడా కల్కి కలెక్షన్స్ పై ఉత్సహంగా పోస్టర్స్ వదులుతున్నారు. కేవలం తొమ్మిది రోజుల్లో 800 కోట్లు కల్కి కొల్లగొట్టింది. కల్కి ని ఇంత పెద్ద హిట్ చేయడం పట్ల ప్రభాస్ పెద్దమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు.
ప్రభాస్ పెదనాన్న, సీనియర్ హీరో దివగంత కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ప్రభాస్ నటించిన కల్కి బుజ్జి రివీల్ ఈవెంట్ దగ్గర నుంచి కల్కి విడుదలైన రోజు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర బుజ్జి కారులో కూర్చుని ఫోజులివ్వడం, కల్కి ఫస్ట్ షో చూసి రివ్యూ ఇవ్వడం ఇవ్వన్నీ చేస్తున్న శ్యామలాదేవి కల్కి ని ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఆమె ప్రభాస్ ఫ్యాన్స్ కి థాక్స్ చెప్పారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు కల్కి ని తమ సినిమాగా ఓన్ చేసుకున్నందుకు పవన్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి శ్యామలాదేవి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. చాలామంది అభిమానులు కల్కి 2898 AD చిత్రం తమ హీరో చిత్రమే అన్నట్టుగా స్పదించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసారు.