గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే SSR-SSMB సెట్స్ మీదకి వెళ్ళిపోతాడని మహేష్ అభిమానులు అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఆచి తూచి మహేష్ సినిమాకి కావాల్సిన స్క్రిప్ట్ అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఆట ముగిసి ఏళ్ళు గడుస్తున్నా రాజమౌళి ఇంకా మహేష్ మూవీ అప్ డేట్ ఇవ్వకపోవడం పై మహేష్ అభిమానుల్లో ఆసక్తితో పాటుగా అసహనం కూడా మొదలయ్యింది.
మే 31 కృష్ణ గారి బర్త్ యానివర్సరీకి SSR-SSMB కాంబో అప్ డేట్ ని ఎక్స్పెక్ట్ చేసి ఉసురుమన్నారు మహేష్ అభిమానులు. SSR-SSMB నిర్మాత ఈ మూవీ సెప్టెంబర్ లో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు. మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు స్క్రిప్ట్ లాకయ్యింది, రాజమౌళి కొన్ని లుక్ టెస్ట్ లలో బిజీగా వున్నారు అన్నారు. ఇంకోపక్క మహేష్ లండన్ లో ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
అయితే తాజాగా మహేష్ ఫ్యాన్స్ కి మరో నెల వెయిటింగ్ తప్పేలా లేదు, మహేష్ పుట్టిన రోజు ఆగష్టు 9 న రాజమౌళి SSR-SSMB కాంబో పై అప్ డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఓ కాన్సెప్ట్ వీడియో తో SSR-SSMB అప్ డేట్ ని అందించాలని రాజమౌళి ప్రస్తుతం ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారని సమాచారం. ఖచ్చితంగా మహేష్ పుట్టిన రోజునాడు SSR-SSMB సర్ ప్రైజ్ ని రాజమౌళి రివీల్ చెయ్యడం పక్కా అంటున్నారు. మరి ఆ రోజు కోసం మహేష్ ఫ్యాన్స్ మరొక్క నెల వెయిట్ చేస్తే చాలు.