రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ కోకాపేటకి చెందిన లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై పోలీసులకి కంప్లైంట్ చెయ్యడమే కాదు.. తన సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫ్ఫైర్ పెట్టుకున్నాడు, ఆమె నన్ను చంపేస్తాను అని బెదిరిస్తోంది, మాల్వి సోదరుడు రాజ్ ని నేను వదిలెయ్యకపోతే నన్ను చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.
ఆ వెంటనే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి ఆమెతో నేను కలిసున్న మాట వాస్తవమే, కానీ నేను లావణ్య తో విడిపోయి మూడేళ్లవుతుంది. లావణ్యకి డ్రగ్స్, మందు అలవాట్లు ఉన్నాయి. ఆమె టార్చర్ భరించలేకే నేను లావణ్యతో విడిపోయాను, ఆమె నన్నే కాదు చాలామందిని ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తుంది, నాతో పని చేస్తున్న హీరోయిన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా లావణ్య కట్టు కథ అంటూ లావణ్యదే తప్పని చెప్పాడు.
ఇక రాజ్ తరుణ్ తో తిరగబడరా సామీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వి మల్హోత్రా ఈ విషయమై స్పందిస్తూ.. లావణ్య ఎవరో నాకు తెలియదు, రాజ్ తరుణ్ నా కో స్టార్ మాత్రమే. రాజ్ తరుణ్ తో నటించే హీరోయిన్స్ అందరికి లావణ్య లింక్ పెట్టి మాట్లాడుతుంది. అసలు లావణ్య ని నేను బెదిరించడమేమిటి, ఆమె నన్ను బెదిరిస్తోంది. నాకు ఫోన్స్ చేసి అసభ్యకరంగా తిడుతుంది. నేను ఆమె నెంబర్ బ్లాక్ చేస్తే నా పేరెంట్స్ నెంబర్లు కనుక్కుని వారితో ఇష్టం వచ్ఛినట్టుగా మాట్లాడుతుంది.
రాజ్ తరుణ్ తో నాకెలాంటి సంబంధం లేదు. నాకు ఫోన్ చేసి టార్చెర్ పెడుతుంది, దానితో నేను రాజ్ తరుణ్ తో ఎనిమిది నెలలుగా కాంటాక్ట్ లో లేను, ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నాను. సమస్య వారిది, కానీ ఈ గొడవలోకి నన్ను లాగింది. రాజ్ తరుణ్ తో స్నేహం మత్రమే ఉంది. నేను లావణ్య పై కంప్లైంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను అంటూ మాల్వి మల్హోత్ర లావణ్య బెదిరిస్తున్న విషయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చింది.