Advertisementt

చంద్రబాబుకు నో చెప్పేసిన రేవంత్!

Sat 06th Jul 2024 09:54 PM
chandrababu  చంద్రబాబుకు నో చెప్పేసిన రేవంత్!
Revanth Reddy said no to Chandrababu! చంద్రబాబుకు నో చెప్పేసిన రేవంత్!
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ప్రజాభవన్ వేదికగా ఈ కీలక భేటీ జరిగింది. అతి కొద్ది మంది మంత్రులు, అధికారుల మధ్యే ఈ సమావేశం జరిగింది. తెలంగాణ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు.. సీఎస్ శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

పరిష్కార మార్గం..!

ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి.. సీఎస్

నీరబ్ కుమార్, ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కాళోజీ-నాగొడవ పుస్తకాన్ని రేవంత్‌ బహుకరించారు. శనివారం సాయంత్రం 6:15 గంటలకు మొదలైన ఈ భేటీ 07:45 వరకూ సాగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. వీటన్నిటికీ అతి త్వరలోనే పరిష్కార మార్గాలు ఉండబోతున్నాయి.

ఆ ఐదు కావాల్సిందే..!

భద్రాచలం నుంచి ఏపీలో  కలిపిన ఏడు మండలలోని 5 గ్రామాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే కోరడం జరిగింది. కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారులతో రెండు కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి మంత్రులలో పొన్నం, శ్రీధర్ బాబులు ఉండే అవకాశం ఉంది.

తిరిగి ఇవ్వలిగా..!

సంవేశంలో భాగంగా.. విద్యుత్‌ బకాయిలపై ఏపీ ప్రస్తావించినది.ఐతే.. బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ సర్కార్ బదులు ఇచ్చింది. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వమే విద్యుత్‌ బకాయి పడిందని రేవంత్ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది. సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్‌ బకాయి లెక్కలను ఇరు రాష్ట్రాల అధికారులు సీఎంల ముందుంచగా ఇదంతా జరిగింది. దీంతో పాటు విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై కీలకంగా చర్చించారు.

ఇస్తారా.. అయ్యే పనేనా..!?

సమావేశంలో భాగంగా.. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. ఇక్కడున్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని రేవంత్‌ కరాఖండిగా చెప్పేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే.. స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి రేవంత్ నో చెప్పేసారు అన్న మాట. ఐతే.. 5 మండలాల విషయంలో చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది తెలియట్లేదు. మొత్తానికి చూస్తే.. తొలి సమావేశం ఆశించినంతగా జరగలేదని మరోసారి బాబు, రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Revanth Reddy said no to Chandrababu!:

Chandrababu meets Revanth Reddy 

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ