Advertisementt

హమ్మయ్య రామ్ చరణ్ ఫ్రీ అయ్యాడు

Sat 06th Jul 2024 08:20 PM
ram charan  హమ్మయ్య రామ్ చరణ్ ఫ్రీ అయ్యాడు
Hammayya Ram Charan is free హమ్మయ్య రామ్ చరణ్ ఫ్రీ అయ్యాడు
Advertisement
Ads by CJ

పాపం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత రావాల్సిన గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ మూడేళ్ళుగా సెట్స్ మీద నడుస్తూనే ఉంది. రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్ మీదకి వెళ్లకుండా గేమ్ చేంజర్  షూటింగ్ ఉన్నప్పుడల్లా శంకర్ తో కలిసి జర్నీ చేస్తూనే ఉన్నాడు. అసలు గేమ్ చెంజర్ షూటింగ్ కి అంతం లేదా.. రిలీజ్ డేట్ ఇవ్వడానికి శంకర్ గారికి తీరిక లేదా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. 

ఇక రామ్ చరణ్ ఎప్పుడో మార్చ్ లో బుచ్చి బాబు తో RC 16ని మొదలు పెట్టాడు. పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళ్లేందుకు రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తుంది. గేమ్ చెంజర్ షూటింగ్ ఓ కొలిక్కి వస్తే కానీ చరణ్ ఫ్రీ అవడు. అందుకే బుచ్చి బాబు వెయిటింగ్. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్రీ అయ్యాడు. గేమ్ చేంజర్ కి సంబందించిన రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయ్యింది. 

దానితో చరణ్ గేమ్ చేంజర్ సెట్స్ నుంచి బయటికి వచ్చేసాడు. ఇకపై బుచ్చిబాబు తో చెయ్యాల్సిన RC 16 సెట్స్ మీదకి వెళ్ళిపోతాడు. ఇక గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ విషయం ఎలా ఉన్నా రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ నుంచి బయటపడ్డాడు. ఇక RC 16 కోసం చరణ్ మేకోవర్ అయ్యేందుకు ఆస్ట్రేలియా వెళతాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా నుంచి రాగానే బుచ్చిబాబు పని మొదలు పెట్టేస్తాడని సమాచారం. 

Hammayya Ram Charan is free:

Ram Charan completes his entire shooting for Game Changer

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ