ఈ ఏడాది గోవాలో బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని గ్రాండ్ గా వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లయ్యింది అయితే ఏంటి.. తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఎప్పటికపుడు ట్రెండీ ఫొటోస్ తో యూత్ ని మెస్మరైజ్ చేసే రకుల్ ప్రీత్ గ్లామర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. భర్త తో కలిసి హనీమూన్ కి వెళ్లినా గ్లామర్ ని దాచుకోకుండా అందాలు ఆరబోసింది.
ఈమధ్యన రకుల్ భర్త జాకీ భగ్నానీ దివాళా తీసాడంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి, కొడుతున్నాయి. స్టాఫ్ కి జీతాలివ్వలేక జాకీ భగ్నానీ కంపెనీ మూసేసారని, ఆయన రీసెంట్ గా తీసిన ఓ భారీ సినిమా వలన జాకీ చాలా నష్టపోయాడంటూ చాలా వార్తలొచ్చాయి.
అదెలాఉన్నా రకుల్ ప్రీత్ మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ కి ఎలాంటి గ్యాప్ ఇవ్వలేదు. ఇండియన్ 2 ప్రమోషన్స్ చేస్తూ ఆ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా తన పనిలో తాను నిమగ్నమైంది. ఎప్పటిలాగే గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. తాజాగా ఆమె అంబానీ ఇంట పెళ్ళి వేడుకల కోసం భర్త జాకీ తో కలిసి అందంగా ముస్తాబైంది.
సిల్వర్ కలర్ లెహంగాలో రకుల్ ప్రీత్ నిజంగా చాలా అందంగా అదరగొట్టేసింది. ఆమె బ్యూటిఫుల్ గా రెడీ అయిన పిక్స్ ని సోషల్ మీడియా షేర్ చేసింది. ఆ పిక్స్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. ప్రస్తుతం రకుల్ ట్రెండీ లుక్ నెట్టింట సంచనంగా మారింది.