ఈరోజు హైదరాబాద్ లో దర్శకుడు శంకర్-లోకనాయకుడు కమల్ హాసన్ ల ఇండియన్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. శనివారం జరగబోయే ఈ ఈవెంట్ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు. తెలుగు మీడియా ముందు ఇండియన్ 2 ఈవెంట్ అంటే దర్శకుడు శంకర్ ఖచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయాలను రివీల్ చేస్తారనే ఆతృతలో మెగా అభిమానులు ఉన్నారు.
రేపు శంకర్ ఇండియన్ 2 మీడియా మీట్ లో ఆ సినిమా విషయాలతో పాటుగా గేమ్ చేంజర్ గురించి స్పందిస్తారని అందరూ ఆసక్తిగా కనిపిస్తున్నారు. మరోపక్క మీడియా వారు కూడా శంకర్ ని గేమ్ చేంజర్ పై ప్రశ్నలు సంధించేందుకు రెడీ అవుతున్నారు. ఎలాగైనా శంకర్ నుంచి గేమ్ చేంజర్ అప్ డేట్స్ రాబట్టాలని తెలుగు మీడియా కాచుకునికూర్చుంది. గత మూడేళ్ళుగా గేమ్ చేంజర్ అప్ డేట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ విసిగిపోయి ఉన్నారు. ఈమధ్యన ఇండియన్ 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో గేమ్ చేంజర్ పై శంకర్ చిన్న చిన్న అప్ డేట్స్ ఇస్తున్నారు.
ఓ పది రోజులు గేమ్ చేంజర్ షూటింగ్ మిగిలి ఉంది. ఇండియన్ 2 విడుదల కాగానే ఆ షూటింగ్ వెంటనే పూర్తి చేసి... పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా గేమ్ చేంజర్ విడుదల తేదీని రివీల్ చేస్తామని శంకర్ చెప్పారు. మళ్ళి ఈరోజు, రేపు శంకర్ గేమ్ చేంజర్ పై ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అని చాలామంది ఆశగా వెయిట్ చేస్తున్నారు.