బాలీవుడ్ క్యూటీ, బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్ కి పెళ్లయింది, ఆ వెంటనే తల్లయ్యింది, అయినా అందంలో ఏ మార్పు లేదు, ఫిజిక్ లో ఏ తేడా లేదు. ఇప్పటికి అదే అందాన్ని మైంటైన్ చేస్తున్న అలియా భట్ ఈమధ్యన ఫ్యామిలీ ఈవెంట్స్ కి అటెండ్ అయితూ తన కుమర్తె రాహాని కూడా ప్రత్యేకంగా తీసుకుని వెళుతుంది.
ఇక ఎప్పుడు మోడ్రెన్ డ్రెస్సులతో మెస్మరైజ్ చేసే అలియా భట్ తాజాగా బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కి అలియా భట్ భర్త రణబీర్ కపూర్ తో కలిసి బ్లాక్ డ్రెస్ కోడ్ లో హాజరైంది. ఆ బ్లాక్ డ్రెస్ లో అలియా భట్ అందం మరింతగా మెరిసిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా వున్న అలియా భట్ ని సౌత్ హీరోలు తమ సినిమాల్లో ఎంపిక చేసుకునేందుకు ఇంట్రెస్ట్ గా కనిపిస్తున్నారు. రాజమౌళి-మహేష్ కాంబో ఫిలిం లో అలియా భట్ హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అలియా భట్ ని ఏ సౌత్ హీరో తమ సినిమాలో బుక్ చేసుకుంటారో చూడాలి.