గుడివాడ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని ని ఎప్పుడెప్పుడు జైల్లో వేస్తారా అని టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు గత నెల రోజులుగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 6 న ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచి కొడాలి నాని కి మూడే క్షణం కోసం చాలామంది ఎదురు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కన్ను మిన్ను కానకుండా బూతు మంత్రిగా పేరొందిన గుడివాడ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని కి కూటమి ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చే క్షణాల కోసం వెయిటింగ్ అంటున్నారు.
అసలు ఇప్పటివరకు నాని ని ఏ కేసులో జైల్లో పెట్టకపోవడంపైన చాలామంది తీవ్ర సంతృప్తిలో కనిపిస్తున్నారు. నాని అరెస్ట్ అవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొడాలి గుడివాడ లో చేసిన అరాచకాలు, ప్రతిపక్షాలపై చేసిన నోటి దురుసు కామెంట్స్ కి శిక్ష పడే క్షణాలు ఆసన్నమైనట్టే కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే టీడీపీ పై కార్యకర్తలపై కొడాలి అనుచరులు చేసిన దాడులపై కేసులు నమోదయ్యాయి
అంతేకాకుండా వాలంటీర్లు కూడా తమతో కొడాలి నాని, ఆయన అనుచరులు బలవంతగా రాజీనామా చేయించాడంటూ కేసు పెట్టారు. ఇప్పుడు తాజాగా మరో కేసు కొడాలి నానిపై రిజిస్టర్ అయ్యింది. కొడాలి నానితో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది.
తన తల్లి మరణానికి వీరంతా కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ కి చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసారు.