బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు సౌత్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తుంది. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లో గ్లామర్ రోల్ పోషిస్తున్న కియారా కి ఈ చిత్రం ఎప్పుడు ట్రీట్ ఇస్తుందో అనేది ఆమె అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారు.
అలాగే మరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలోను హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ కియారా పేరు పరిశీలిస్తున్నట్టుగా టాక్ ఉంది. మరోపక్క హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న కియారా తాజగా ముంబైలోని ఓ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ కి కియారా కత్తిలాంటి మోడ్రెన్ డ్రెస్ లో హాజరైంది.
ఎప్పుడు గ్లామర్ కి కెరాఫ్ గా కనిపించే కియారా అద్వానీ తాజాగా వేసిన బ్లాక్ అండ్ వైట్ టాప్ లో అందాలు అద్భుతంగా పరిచేసింది. లూజ్ హెయిర్ లో కియారా ఇచ్చిన కత్తిలాంటి ఫోజుకి ఫ్యాన్స్ మాత్రమే కాదు నెటిజెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరి మీరు కియారా లేటెస్ట్ లుక్ ని ఓ చూపు చూసెయ్యండి.