కల్కి చిత్రాన్ని చూసి చాలామంది ఆహా ఓహో అన్నా మరికొంతమంది కల్కి ని చాలానే విమర్శించారు. B,C సెంటర్స్ ఆడియన్స్ అయితే కల్కి నచ్చలేదు అని మొహం మీదే చెప్పారు. ప్రభాస్ కేరెక్టర్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్, మ్యూజిక్, BGM విషయంలో అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. డబ్బింగ్ కూడా ఏదో పట్టి పట్టి చెప్పినట్టుగా, చాలా లాగ్ సీన్స్ ఉన్నాయంటూ చెప్పారు.
ఇప్పుడు అదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడాఒప్పుకున్నాడు. నిన్న శుక్రవారం కల్కి సెట్స్ లోనే నాగ్ అశ్విన్ మీడియా మీట్ లో పాల్గొన్నారు. ఆ మీట్ లోనే కల్కి లో పొరబాట్లు జరిగాయంటూ ఆయన కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ హాఫ్ లాగ్ గురించి మట్లాడుతూ.. కథని డిటైల్డ్ గా చెప్పాలనే ఉద్దేశ్యంతో కల్కి ని రెండు పార్టులుగా చేసాము. అక్కడే ఫస్ట్ హాఫ్ లాగ్ అయ్యింది. ఇంకాస్త ఎడిటింగ్ గ్రిప్పింగ్ చేస్తే బావుండేది. అలాగే మ్యూజిక్ విషయంలోనూ కొన్ని చోట్ల అదిరిపోతే.. మరికొన్ని చోట్ల మేము అనుకున్న అవుట్ ఫుట్ రాలేదు. BGM ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది అన్నారు.
ఇక డబ్బింగ్ విషయంలోనూ నాగ్ అశ్విన్ స్పందించారు. మహానటిలాగే ఇందులోనూ అందరితో ఓన్ డబ్బింగ్ చెప్పించాలి అనుకున్నాము. కానీ చివరి నిమిషంలో తొందరపాటు వలన సరైన ఫినిషింగ్ రాలేదు, పట్టి పట్టి చెప్పినట్టుగా మాకు అనిపించింది. నటించేవాళ్లే డబ్బింగ్ చెబితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అందుకే అలా చేసాము అంటూ నాగ్ అశ్విన్ కల్కి పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ తమకి అర్ధమయ్యాయని చెప్పడం గమనార్హం.