Advertisementt

సమంత vs డాక్టర్

Fri 05th Jul 2024 07:42 PM
samantha  సమంత vs డాక్టర్
Samantha vs Doctor సమంత vs డాక్టర్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా సమంత సినిమా షూటింగ్స్ పక్కనపెట్టి మాయోసైటిస్ నుంచి కోలుకుంటూనే తాను ఆ వ్యాధి నుంచి ఎలా బయటపడిందో అనేది పాడ్ కాస్ట్ ద్వారా ఇంటర్వూస్ లో హెల్త్ టిప్స్ ఇస్తూ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా సమంత హెల్త్ విషయాలను మాట్లాడుతుంది. అలాగే మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

దానితో ఓ డాక్టర్ సమంత పై ఫైర్ అయ్యాడు. ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిని సమంత ఇలాంటి తప్పుడు టిప్స్ తో తప్పు దోవ పట్టిస్తుంది అంటూ సమంత ని జైల్లో పెట్టాలంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సమంత ఇచ్చిన టిప్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదని.. 

దానిపై ఎలాంటి అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను సమంత తప్పుదోవ పుట్టిస్తుంది, ఆమెని జైల్లో పెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా సమంత పై ఫైర్ అయ్యాడు. దానికి సమంత కూడా రియాక్ట్ అయ్యింది. తనని జైల్లో పెట్టినా పర్వాలేదు. నేను డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తనతో చర్చకు వచ్చి ఉంటే బావుండేదని, కానీ ఇలా ట్వీట్ పెట్టి ఆయన చీప్ అయ్యాడంటూ సమంత కూడా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.

Samantha vs Doctor :

Samantha responds after a doctor says she should be thrown in prison after Nebulisation post

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ