Advertisementt

పెళ్లి చేసుకోనంటున్న క్రేజీ హీరోయిన్

Fri 05th Jul 2024 06:32 PM
shruti haasan  పెళ్లి చేసుకోనంటున్న క్రేజీ హీరోయిన్
Crazy heroine who doesnot want to get married పెళ్లి చేసుకోనంటున్న క్రేజీ హీరోయిన్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటికే రెండుసార్లు బ్రేకప్ చేసుకుంది. మొదటిసారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని పెళ్లి వరకు వెళ్లిన శృతి హాసన్ ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి కొన్నాళ్ళు ఒంటరిగానే కనిపించింది. ఇక శాంతను తో కొన్నేళ్లు రిలేషన్ మైంటైన్ చేసిన శృతి హాసన్ ఈ మద్యన అతనికి కూడా బ్రేకప్ చెప్పేసి సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. 

ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటుగా పర్సనల్ ప్రొబ్లెమ్స్ ని కూడా షేర్ చేస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియా చిట్ చాట్ లో శృతి హాసన్ ని పెళ్ళెప్పుడు చేసుకుంటారు, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు అని ఓ అభిమాని ప్రశ్నించాడు. 

దానికి శృతి హాసన్ కాస్త సీరియస్ గానే ఇది 2024. అమ్మాయిలని ఇలాంటి తెలివి తక్కువ, పనికిమాలిన ప్రశ్నలని అడగడం మానుకోండి. నేను పెళ్లి మాత్రం చేసుకోను(ఐ వోన్ట్ సర్ ) అంటూ బదులిచ్చింది. అంటే ఈ క్రేజీ హీరోయిన్ లైఫ్ లో పెళ్లి చేసుకోదా .. దానికి కారణం ఆమె బ్రేకప్స్ ఏనా అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి శృతి హాసన్ ప్రస్తుతం అడివి శేష్ తో ఓ మూవీ, ప్రభాస్ తో సలార్ 2 అలాగే తాజాగా రజినీకాంత్ కూలి లో కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తూ చాలా బిజీగా వుంది. 

Crazy heroine who doesnot want to get married:

Shruti Haasan shuts down marriage questions

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ