హీరో రాజ్ తరుణ్ కొన్నాళ్లుగా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు. మొదట్లో రెండు మూడు సినిమాలు హిట్ అయినా ఆ అర్వాత వచ్చిన సినిమాలన్నీ అతన్ని నిరాశపరుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కెరీర్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లోను హీరో రాజ్ తరుణ్ కి సమస్యలు ఎదురవుతున్నాయి. రాజ్ తరుణ్ తో గతంలో రిలేషన్ లో ఉన్న లావణ్య అనే అమ్మాయి ఇప్పుడు రాజ్ తరుణ్ పై కేసు పెట్టడం సంచలనం సృష్టించింది.
తాను రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, మేము గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాము. ఇప్పుడు మా రిలేషన్ ని బ్రేక్ చేస్తూ తాను నటిస్తున్న సినిమాలోని ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు. రాజ్ తరుణ్ గత మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు. అసలు నాతో పరిచయం లేని వాడిలా ప్రవర్తిస్తున్నాడు. నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నాను, ఆ సమయంలో రాజ్ నాకు ఎలాంటి సహాయం అందించలేదు.
నేను రాజ్ ని వదలకపోతే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు రాజ్ కావాలి.. అంటూ రాజ్ తరుణ్ స్నేహితురాలు కమ్ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.