సెలబ్రిటీస్ కి జాతకాలూ చెబుతూ అందులో కొన్ని నిజమయ్యేసరికి సెలెబ్రిటీ ఆస్ట్రాలజర్ అవతరమెత్తి యూట్యూబ్ లో తెగ పాపులర్ అయిన వేణు స్వామి ఈమధ్యన రాజకీయనేతలకి, సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్పడం మానేసి పబ్బులు వెంబడి తిరుగుతున్నాడు. ఆంధ్రలో వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం లోకి రాకపోయినా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసినా తాను జాతకాలు చెప్పడం మానేస్తాను అని, వైసీపీ గెలిస్తే ఇక తెలుగుదేశం పార్టీనే ఉండదంటూ మాట్లాడిన వేణు స్వామి..
జూన్ 6 ఏపీలో కూటమి విజయం సాధించిన వచ్చిన రోజే జాతకాలు చెప్పను, నా మాట తప్పయింది అంటూ జాతకాలకి బై బై చెప్పిన వేణు స్వామి ఆ తర్వాత ఓ పబ్బులో కనిపించి షాకిచ్చాడు. ఇకపై సామాన్యులకి జాతకాలు చెబుతా అంటున్న వేణు స్వామి హీరోయిన్స్ చేత స్పెషల్ పూజలు చేస్తూ కూడా తెగ ఫేమస్ అయ్యాడు.
ఈ మధ్యన వేణు స్వామి బిగ్ బాస్ లోకి వెళతాడని ప్రచారం జరుగుతుంది. వేణు స్వామి ఆగష్టు లో మొదలు కాబోయే బిగ్ బాస్ తెలుగు లోకి ఎంటర్ అయ్యే కాండేట్ అని.. ప్రచారం జరుగుతుండగా.. వేణు స్వామి బిగ్ బాస్ లోకి వెళ్లి అందులో ఉన్న 20 మంది హౌస్ మేట్స్ జాతకాలు చెప్పుకుంటూ ఎంటర్టైన్ చేస్తాడేమో అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్.