హీరోయిన్ కృతి శెట్టికి తెలుగులో వరసగా నిరాశ పరిచే ప్రాజెక్ట్స్ తగులుతున్నాయి. యంగ్ హీరోలంతా కృతి శెట్టికి హిట్ ఇవ్వలేకపోయారు. నిన్నగాక మొన్నొచ్చిన శర్వానంద్ తో కలిసి నటించిన మనమే కూడా కృతి శెట్టిని అందుకోలేకపోయింది. మనమే చిత్రంతో టాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అవుదామనుకున్న కృతి శెట్టి కి ఆ చిత్రం కూడా షాకిచ్చింది.
అయినప్పటికీ ఈ అమ్మడుకి తమినాట దర్శకనిర్మాతలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇప్పటికే కార్తీ సినిమాకి సైన్ చేసిన కృతి శెట్టి జయం రవితో ఒక సినిమా చేస్తుంది. మరో పక్క ప్రదీప్ రంగరాజన్ తో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో LIC చిత్రంలోనూ నటిస్తుంది. ఇలా వరస ఆఫర్స్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టికి ఇప్పుడు అక్కడ మరో ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తమిళంలో సెల్వమణి సెల్వరాజ్ అనే యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రంలోనే దుల్కర్ సరసన కృతి శెట్టి నటించబోతోంది. ఈచిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలులేని కృతి శెట్టి ఇలా మళ్ళీ తెలుగులోకి అడుగుపెట్టబోతుంది.