ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ ముగించే దిశగా పరుగులు పెడుతున్నారు. కొరటాల శివ దేవర షూటింగ్ ని చకచకా ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ సమీపంలో దేవర సెట్స్ లో షూటింగ్ జరుగుతుండగా.. ఆ తర్వాత సాంగ్స్ కోసం హీరోయిన్ జాన్వీ కపూర్ తో సహా ఎన్టీఆర్ విదేశాలకి వెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో పాటుగా ప్రశాంత్ నీల్ తో NTR 31 సెట్స్ లోకి వెళ్ళిపోతారు.
నిన్నటిరకు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 మొదలు పెడతారంటూ ప్రచారం జరిగినా.. ముందుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు. ముందు NTR 31 స్క్రిప్ట్ లాక్ చేసి షూటింగ్ మొదలు పెట్టాక ఆ తర్వాత ప్రభాస్ సలార్ షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. సలార్ పార్ట్ 2 షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ అవడంతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు దానిని కాస్త పక్కనపెట్టి NTR 31 సెట్స్ మీదకి వచ్చెయ్యాలని డిసైడ్ అయ్యారట.
ఆగష్టు లో పూజ కార్యక్రమాలు మొదలు పెట్టి సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లేలా అంటే దేవర ప్రమోషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సెట్స్ లోకి వచ్చేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక కానీ అలియా భట్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా సమాచారం.