టాలీవుడ్ హీరోలు కోలీవుడ్, మల్లువుడ్ ఇలా ఏ భాష హీరోలతోనైనా స్నేహం చెయ్యడమనేది పరిపాటి. మెగాస్టార్ చిరంజీవికి అన్ని భాషల హీరోలతో తత్సంబందాలు ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ సీనియర్ నటులు మోహన్ బాబు తో ప్రాణం కన్నా ఎక్కువగా స్నేహంగా ఉంటారు. ఆయన హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా మోహన్ బాబు ఇంటికి వెళతారు.
మోహన్ బాబు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి పెదరాయుడు సినిమాలో ఓ కేరెక్టర్ ని రజిని ఫ్రీగా చేసి పెట్టరనే విషయం చాలా సందర్భాల్లో మోహన్ బాబు చెప్పారు. ఇక తిరుపతి వెళ్లినా మోహన్ బాబు యూనివర్సటీకి వెళ్లి రజిని అక్కడ మోహన్ బాబు ఇంట్లోనే స్టే చేస్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు
ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఎయిర్ పోర్ట్ వెహికల్ లో కూర్చుని కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోస్ చూడగానే ప్రాణ స్నేహితులిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రాగా.. మోహన్ బాబు ఎయిర్ పోర్ట్ లో రజినీకాంత్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు.