Advertisementt

రాజా సాబ్ ఇక తగ్గేదేలే ..

Thu 04th Jul 2024 03:58 PM
raja saab  రాజా సాబ్ ఇక తగ్గేదేలే ..
Raja Saab will not decrease anymore.. రాజా సాబ్ ఇక తగ్గేదేలే ..
Advertisement
Ads by CJ

ప్రభాస్ కల్కి ప్రభంజనం సృష్టించింది. కల్కి 2898 AD విడుదలై అప్పుడే వారం గడిచిపోయింది. ఇంకా ప్రభాస్ కల్కి లెక్కల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. కల్కి  కలెక్షన్స్, కల్కి బ్రేక్ ఈవెన్ ఏరియాస్, కల్కి ఇక్కడ ఇన్ని రికార్డులు కొల్లగొట్టింది అంటూ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కల్కి న్యూస్ లే కనబడుతున్నాయి. 

ప్రస్తుతం కల్కి సక్సెస్ ని ప్రభాస్ ఇటలీలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కల్కి రికార్డుల ప్రభంజనంపై విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సలార్, కల్కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పై వారి సంతోషం వర్ణనాతీతం. అయితే కల్కి విషయాలు అలా ఉంటే ప్రభాస్ ఇటలీ నుంచి వచ్చాక ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారనే విషయంలో చాలా సస్పెన్స్ నడుస్తుంది. 

సలార్ 2 సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. హను రాఘవాపుడితో ప్రభాస్ మూవీ మొదలు కావాలంటే మరో రెండు నెలల సమయం ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పరిస్థితి కూడా అదే. కల్కి 2 షూటింగ్ కి కొద్దిగా సమయముంది. ఈలోపులో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ పూర్తి చేసేస్తారట. ఇప్పటికే మారుతి హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

ఓ వారం పాటు హీరోయిన్స్ పై షూటింగ్ చెయ్యగానే ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లోకి జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ యాక్షన్ మూవీస్ తో ఆకట్టుకుంటూ ఉండగా.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనెర్ గా డిఫ్రెంట్ మూవీలో విభిన్నంగా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసేస్తే మారుతి రాజా సాబ్ ని సంక్రాంతి బరిలో నిలిపినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. రాజాసాబ్ షూటింగ్ విషయంలో ఇకపై తగ్గేదేలే అన్నమాట. 

Raja Saab will not decrease anymore..:

Raja Saab shooting update 

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ