కళ్యాణ్‌గారూ అంటే అందరికీ కోపం వస్తుందేమో కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని అత్యంత ఆప్తులైన వారంతా ఆయనని ఇలానే పిలుచుకుంటారు. ఇది ఆయనకు బాగా దగ్గరైన వారికి మాత్రమే తెలిసిన విషయం. సరే విషయంలోకి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ఇస్తున్న హై అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఊపిరి కూడా పీల్చుకోనివ్వడం లేదు అంటే బాగుంటుందేమో. జూన్ 4వ తేదీ గెలుపు వార్త వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మెగా ఫ్యాన్స్‌కి ఏదో ఒక సందర్భంలో కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
ఢిల్లీ పర్యటన, మోదీ ప్రశంసలు, అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వచనాలు తీసుకోవడం, ప్రమాణ స్వీకారం, అన్నదమ్ములను మోదీ దగ్గరకు తీసుకుని మాట్లాడటం.. ఇలా ఒక్కటేమిటి? గెలిచిన క్షణం నుంచి ఏదో ఒక హై ఇస్తూనే ఉన్నారు. తన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ రోజు (బుధవారం) కూడా ఫ్యాన్స్ గర్వపడే విధంగా పవర్ స్టార్ ఓ పని చేశారు. అదేంటో ఇక్కడ చెప్పేలోపే.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అంటే ఎంతగా ఆయన మార్క్ ప్రజల్లోకి వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కారులో వెళుతుండగా.. ఓ చిన్న పిల్లాడు జనసేన జెండా పట్టుకుని కనిపించాడు. అంతే, కారు దిగి మరీ ఆ పిల్లాడు దగ్గరకి వెళ్లి అభినందించారు పవన్ కళ్యాణ్. రాబోయే జనరేషన్ కోసం.. ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం మొదటి నుంచి పవర్ స్టార్ ప్రదర్శిస్తూ వస్తున్నారు. అది మరోసారి చేతల్లో చూపించారు. ఇదిలా ఉంటే.. ఈ హై లు అన్ని తట్టుకోవడం మా వల్ల కావడం లేదన్నా.. అంటూ అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతుండటం గమనార్హం.