Advertisementt

బాద్‌షాకు అరుదైన గౌరవం

Wed 03rd Jul 2024 08:25 PM
shah rukh khan  బాద్‌షాకు అరుదైన గౌరవం
Rare Honor To Bollywood Baadshah Shah Rukh Khan బాద్‌షాకు అరుదైన గౌరవం
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజండ్స్ వంటి మేకర్స్, నటులు ఉన్నా కూడా బాలీవుడ్‌ నిలదొక్కుకోలేకపోతుంది. అందుకు కారణం ఏమటనేది పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో కాస్త బాలీవుడ్ పరువు నిలబడిందంటే మాత్రం అందుకు కారణం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అనే చెప్పుకోవాలి. పఠాన్, జవాన్ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌ని పడిపోనియకుండా నిలబెట్టాడు బాద్‌షా. అంతేకాదు, షారుఖ్‌కు చెందిన ఐపీఎల్ టీమ్ ఈ ఏడాది విన్నర్‌గా నిలవడం కూడా షారుఖ్ స్టామినాని తెలియజేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్న షారుఖ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఏంటది అనుకుంటున్నారా?

స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు షారుఖ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ ఏడాది జరిగే ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫారుక్‌ ఖాన్‌ను ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ సత్కారంతో పాటు.. షారుఖ్ సినిమాల్లో క్లాసికల్‌ హిట్‌గా నిలిచిన దేవదాసు సినిమాను ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నారు. నిజంగా ఇది అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ 77వ లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో షారుక్‌ లాంటి దిగ్గజ నటుడిని సత్కరించుకోవాలనే కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా, నటుడిగా భారతీయ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసిన షారుక్‌‌ను సత్కరించడం మా గౌరవం.. అని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్విట్జర్లాండ్‌లో ఆగస్ట్ 7 నుంచి 17వ తేదీ వరకు జరగనుండగా..ఆగస్ట్ 10న షారుఖ్‌ను సత్కార కార్యక్రమం జరగనుంది.

Rare Honor To Bollywood Baadshah Shah Rukh Khan:

Life Achievement Award To SRK at Locarno International Film Festival

Tags:   SHAH RUKH KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ