మృణాల్ ఠాకూర్ జాక్ పాట్ కొట్టింది. సౌత్ ఇండస్ట్రీ తనకి పేరుని తీసుకొచ్చినా ఆమె మాత్రం బాలీవుడ్ వైపే చూస్తుంది. బాలీవుడ్ లోనే మృణాల్ ఠాకూర్ ప్రూవ్ చేసుకుందామనుకుంది కానీ ఆమెకి అక్కడ ఆశించిన ఆఫర్స్ అయితే రాలేదు. ఇటు సౌత్ లో చూస్తే మంచి మంచి కాంబినేషన్స్ లో సినిమాలు సెట్ అవడంతో సౌత్ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించేసుకుంది.
అయితే సౌత్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టేద్దామనుకున్న మృణాల్ ఠాకూర్ కి ఫ్యామిలీ స్టార్ చిన్నపాటి షాకైతే ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ ప్రాజెక్ట్ ఏమి సైన్ చెయ్యని మృణాల్ కి ఇప్పుడు బాలీవుడ్ లో జాక్ పాట్ తగిలింది అనే చెప్పాలి. అజయ్ దేవగన్ మరియు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించేబోయే సన్ ఆఫ్ సర్దార్ 2 లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా సైన్ చేసేసింది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రాన్ని స్కాట్లాండ్‌లో గ్రాండ్ గా మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం లండన్‌లో చిత్రీకరించబడుతోంది అని సన్ ఆఫ్ సర్దార్ 2 తెలుగులో తెరకెక్కిన మర్యాదరామన్న కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.
అంతేకాకుండా హిందీలోనే మృణాల్ ఠాకూర్ పూజా మేరీ జాన్ అనే మరో సినిమా కూడా చేస్తోంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అయినా మృణాల్ టైమ్ అక్కడ స్టార్ట్ అయినట్లే.