జబర్దస్త్ లో ఉన్నప్పుడు రోజా భజన చేసిన కిర్రాక్ ఆర్పీ ఆ తర్వాత కూడా అతను పెట్టిన బిజినెస్ లకి రోజా ఆశీర్వాదం కావాలంటూ ఆమెతో నెల్లూరు చేపల పులుసు ని ఓపెన్ చేయించుకున్న ఆర్పీ ఇప్పుడు రోజా పై చేస్తున్న కామెంట్స్ చూస్తే రోజా పై ఆర్పీ కి ఇంత కోపముందా అనిపిస్తుంది. కానీ రోజా కూడా జబర్దస్త్ కమెడియన్స్ ని చాలా చీప్ గా మాట్లాడం, జబర్దస్త్ కమెడియన్స్ అంతా జనసేన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో ఆమె కూడా కమెడియన్స్ పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేసింది.
అప్పటి నుంచి ఆర్పీ రోజా ని టార్గెట్ చేస్తున్నాడు. రోజా పై విరుచుకుపడుతున్నాడు. ఎన్నికలకు ముందు.. వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది అందులో రోజా అందరికన్నా ముందే దారుణంగా ఓడిపోతుంది అంటూ రోజాపై ఆర్పీ కామెంట్స్ చేసాడు. ఆర్పీ అన్నట్టుగానే రోజా ఓటమిపాలైంది. వైసీపీ ఓడిపోయింది.
అయినా ఆర్పీ రోజా ని వదలడం లేదు. తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకుని వైసీపీ ఓడిపోయింది. కూటమిలో టీడీపీ-జనసేన-బీజేపీ మాత్రమే కాదు ఆ తిరుపతి వెంకన్న కూడా కలిసి వైసీపీ ని ఓడించాడని మాట్లాడిన ఆర్పీ రోజా మినిస్టర్ అయ్యాక పర్యాటక శాఖామంత్రిగా చాలాబాగా వెనకేసింది.. ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.3000 కోట్లు సంపాదించారని.. తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని దమ్ముంటే దీనిపై రోజా చర్చించేందుకు రావాలని ఆర్పీ సవాల్ విసిరాడు.
రోజా మాత్రమే కాదు.. జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, పెద్దిరెడ్డి , మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు వేలకోట్లు సంపాదించారని సంచలన కామెంట్స్ చేసాడు ఆర్పీ.