శర్వానంద్-కృతి శెట్టి కలయికలో జూన్ 7 న విడుదలైన మనమే చిత్రం కి ఆడియన్స్ అలాగే క్రిటిక్స్ ఇద్దరూ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. ఈ చిత్రం పై శర్వానంద్-అటు హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం థియేటర్స్ దగ్గర యావరేజ్ ఫిలిం గా నిలిచిపోయి శర్వాకి కృతికి ఇద్దరికి నీరసాన్ని మిగిల్చింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయ్యి నాలుగో వారం లోకి ఎంటర్ అవడం, అలాగే మనమే చిత్రం థియేటర్స్ రన్ పూర్తవడంతో మనమే చిత్రం ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోపక్క శర్వా మనమెతో పాటుగా విడుదలైన సత్యభామ ఇంకా చిన్న చిత్రాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసాయి.
మనమే ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని జులై రెండో వారం నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మనమే జులై 12 న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని, దానిపైన అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చని తెలుస్తోంది.