కల్కి 2898 AD చిత్రం గత గురువారం విడుదలై మౌత్ టాక్ మాత్రమే కాదు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఓపెనింగ్స్ విషయంలో కాస్త అటు ఇటు అయినా, మొదటి వీకెండ్ లో 550 కోట్ల కలెక్షన్స్ తో ఔరా అనిపించింది. అయితే కల్కి చూసిన B, C సెంటర్స్ ఆడియన్స్ మాత్రం కల్కి లోని తప్పులని కోకొల్లలుగా చెబుతున్నారు.
ముందుగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ విషయంలో బాగా డిజ్ పాయింట్ అయ్యి ఉన్నారు. BGM విషయంలోనూ అదే అసంతృప్తి. ఈ మ్యూజిక్ విషయంలో కల్కి 2 లో నాగ్ అశ్విన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు నాగ్ అశ్విన్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కొన్ని లాజిక్ లేని సీన్స్, కల్కి పై వస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకుని కల్కి 2 లో అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
చాలా సీన్స్ రిపీట్ అయినట్లుగా అనిపించాయి. కథలో ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం, ప్రభాస్ కి అసలు హీరోయిన్ లేకపోడం, గెస్ట్ పాత్రలని సరిగ్గా వాడుకోలేకపోవడం, కమల్ హాసన్ పాత్ర అర్ధం కాలేదు. ప్రభాస్ డబ్బింగ్ విషయంలో శ్రద్ద తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కల్కి 2 లో పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి, కల్కి ఫస్ట్ హాఫ్ విషయంపై ఎంతగా విమర్శలొచ్చాయో ఈసారి పార్ట్2 లో అది లేకుండా చూసుకోమంటూ సలహాలు పారేస్తున్నారు.
నిజమే నాగ్ అశ్విన్ పై చాలా బాధ్యత ఉంది. పార్ట్ 2 విషయంలో నాగ్ అశ్విన్ చాలా శ్రద్ద పెట్టాల్సి ఉంది. ఈ విమర్శలని ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.