క్రేజీ బ్యూటిఫుల్ గర్ల్ శ్రీలీల కొద్దిరోజులు కామ్ గా కనిపించింది. ఆ కొద్దిరోజుల్లోనూ శ్రీలీల షాప్ ఓపెనింగ్స్, అలాగే ఏదో ఒక విషయంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉండేది. ధమాకా విజయం అమ్మడుని ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేకుండా బిజీ చేసేసింది. యంగ్ హీరోల అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైంది.
కానీ పాత్రల ఎంపికలో పొరబాట్లు చేసింది. అదే పొరపాట్లు ఆమెని నిరాశలోకి నెట్టింది. తనకొచ్చిన కేరెక్టర్ పై అవగానే లేకుండా చేసిన సినిమాలన్నీ వరసబెట్టి శ్రీలీల కి షాకిచ్చాయి. అయినప్పటికీ శ్రీలీలకి వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రవితేజ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్ లో నటిస్తుంది.
అలాగే కోలీవుడ్ లో అజిత్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అంటున్నారు. మరోపక్క బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది అనే న్యూస్ కూడా ఉంది. అయితే తాజాగా శ్రీలీల చెన్నై లో సందడి చేసింది. అక్కడికి వెళ్లిన శ్రీలీలని కోలీవుడ్ లో ఏ హీరోయిన్ అంటే ఇష్టమని అడిగితే.. టక్కున లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు చెప్పింది. నయనతార మాత్రమే కాదు.. నాకు తమిళ నటీనటుల్లో చాలామంది ఇష్టమంటూ సేఫ్ గేమ్ ఆడింది శ్రీలీల.