కన్నడ సినీ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. తన అభిమాని రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందుతుడు. ఈ కేసులో దర్శన్ తో పాటుగా మరో 16 మంది నిందితులుగా జైలుపాలయ్యారు. నటి పవిత్ర గౌడ కి అసభ్యకర మెసేజెస్ పంపించిన కారణంగా రేణుకా స్వామిని దర్శన్ కిరాయి గుండాలతో అత్యంత పాశవికంగా హత్య చేయించిన ఘటన ఇప్పటికి హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న దర్శన్ ఇంకా పవిత్ర గౌడ మరికొంతమంది నిందితులని పోలీసులు రకరకాలుగా విచారిస్తున్నారు. ఇక హీరోయిన్ పవిత్ర గౌడ జైల్లో కూడా మేకప్ వాడడంపై జైలు అధికారులపై తీవ్ర విమర్శలు రాగా.. ఇప్పుడు జైల్లో నిందితుడుగా ఉన్న దర్శన్ కి రాచ మర్యాదలు అందుతున్నాయనే వార్తలు సంచలనం సృష్టిసున్నాయి.
జైల్లో దర్శన్ కలిసేందుకు ఆయన ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా ఎవ్వరికి తెలియకుండా హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ ప్రైవేట్ వాహనంలో దర్శన్ కుటుంబ సభ్యులను అతని దగ్గరకి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. దర్శన్ తల్లి మీనా, తమ్ముడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ పరప్ప అగ్రహార జైలులో దర్శన్ ని కలిసేందుకు పలుమార్లు హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ ప్రవేట్ వాహనాన్ని వాడుతూ వాళ్ళని దర్శన్ ని కలిసే ఏర్పాట్లు చెయ్యడం పై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇది చూస్తే బెంగళూరు సెంట్రల్ జైలులో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్ధమవుతుంది అంటూ పలువురు నెటిజెన్స్ దర్శన్ కి అందుతున్న రాచ మర్యాదలపై కామెంట్స్ పెడుతున్నారు.