ఈ ఏడాది నిజంగా నందమూరి నామ సంవత్సరమే అనిపించకమానదు. ఈ ఏడాది నందమూరి హీరో ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27 న విడుదల కాబోతుంది. ఇక నందమూరి బాలకృష్ణ -బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 109 చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది అనే టాక్ కూడా చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ ఏడాది నందమూరి అభిమానులకి ముఖ్యమైంది. అదేమంటే నందమూరి మరో వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్దమవుతుంది. నిన్న సోమవారం సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక్కసారిగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లుక్ వైరల్ గా మారడమే కాదు.. మోక్షజ్ఞ సోషల్ మీడియా హ్యాండిల్ అంటూ ఓ ఫేక్ హ్యాండిల్ నుంచి వస్తున్నా అంటూ ఓ పవర్ ఫుల్ కామెంట్ కనిపించింది.
ఇంకేముంది అది ఫేక్ హ్యాండిలా లేదంటే నిజమైన మోక్షజ్ఞ సోషల్ మీడియా హ్యాండిలా అనేది పక్కనపెట్టి మోక్షజ్ఞ న్యూ లుక్ ని నందమూరి అభిమానులు వైరల్ చేస్తూ..
This Year Balayya - NBK109 💥🔥
NTR - DEVARA 💥🔥
MOKSHU - DEBUT 💥🔥👍
నందమూరి నామ సంవత్సరం 💥💥💥💥 అంటూ అభిమానులు ట్వీట్లు వేస్తూ హల్ చల్ చేస్తున్నారు.