నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ఎంట్రీ పై కొన్నేళ్లుగా తీవ్ర సస్పెన్స్ నడుస్తుంది. నిన్నగాక మొన్న బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో కొడుకుని హీరోగా పరిచయం చెయ్యబోయే మూవీ అప్ డేట్ ఏమైనా ఇస్తారెమో అని నందమూరి అభిమానులు ఎదురు చూసారు. కానీ మోక్షు సినిమాపై అప్ డేట్ లేకపోయేసరికి డిజ్ పాయింట్ అయ్యారు.
చాలా రోజులుగా మోక్షజ్ఞ హీరో గా మేకోవర్ అవుతున్నాడు. కొన్నాళ్లుగా మోక్షజ్ఞ ఎక్కడ కనిపించినా చక్కటి హ్యాండ్ సమ్ లుక్స్ తో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు. అందుకే నందమూరి అభిమానులుఎప్పటికప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు. మోక్షజ్ఞ హీరోగా మారే క్షణాల కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
తాజాగా నందమూరి వారసుడు లుక్ ఒకటి బయటికి వచ్చింది. చూడగానే అచ్చం హీరో లా కనిపించేసరికి అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మోక్షజ్ఞని ఆ ఎల్లో షర్ట్ లో చూసేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వస్తున్నా నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అంటూ మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అన్నట్టు మోక్షజ్ఞ తెరంగేట్రం మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారో అనే విషయంలో కూడా తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. మరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే అదృష్టం ఏ దర్శకుడుకి దక్కుతుందో చూద్దాం.!