2024 ఎలక్షన్ లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి జగన్ ఒంటెద్దు పోకడలే ముఖ్యకారణం కాగా.. మీకు నేనున్నాను, నేను విన్నాననే స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లిన జగన్ తిరుగులేని మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించిన జగన్ ఆ తర్వాత ప్రజల సమస్యలను వినడం మానేశారు అది వాస్తవం. ఇక జగన్ ని నట్టేట ముంచిన వారిపై బ్లూ మీడియా చీల్చి చెండాడింది. జగన్ చుట్టూ కోటరి, తిమింగలాలంటూ వైసీపి పార్టీ పతనానికి వీరే కారణమంటూ కొన్ని పేర్లు రివీల్ చేసింది.
ప్రభుత్వ సలహాదారు పాత్రలో ప్రభుత్వంలో జగన్ తర్వాత నేనే అంటూ నెంబర్ 2 గా వ్యవహారాలు చక్కబెడుతూ.. జగన్ దగ్గరకి ఎవరూ రాకుండా, ఆయనకి ఏమి తెలియకూండా, జగన్ చుట్టూ కంచెలా కాపు కాపుకాసి లాభపడ్డారట సజ్జల. మంత్రులు ఏం మాట్లాడాలన్నా సజ్జల సలహా తీసుకోవాల్సిందేనట. అలా జగన్ కి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా, నెగిటివిటి పెరుగుతున్నా జగన్ కళ్ళకు కనబడుకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి తన కొడుకు భార్గవ్ రెడ్డితో సహా కంచె కట్టి కాపలా కాసారట.
ఇక మరో వ్యక్తి ధనుంజయ రెడ్డి వైసీపీ లో బలవంతుడిగా మారి జగన్ అప్పోయింట్మెంట్ కావాలంటే అతనికి ముడుపులు చెల్లించుకోవాలట. జగన్ దగ్గరకి వెళ్లాలంటే ధనుంజయ్ రెడ్డి జేబు నిండాలి, ఇంకా కాంట్రాక్టులు కూడా ధనుంజయ రెడ్డి పది శాతం పర్శంటేజ్ తో ఓకె చేస్తూ జగన్ కి ఏమి తెలియనివ్వకుండా, తెలియకుండా వైసీపీని బ్రష్టు పట్టించిన వారిలో కీలకమంటూ బ్లూ మీడియా ధనుంజయ రెడ్డిని ఏసుకుంది.
ఇక జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ నే కాదు ఉత్తరాంధ్రను వైసీపీ కి కాకుండా చేసాడు, విజయ్ సాయి రెడ్డి అయితే సజ్జలతో పోటీ పడుతూ నెంబర్ 2 స్థానమంటూ తన స్వార్ధానికి పార్టీని అడ్డం పెట్టుకుని తన పనులు చేసుకున్నాడు. బీజేపీ తో ర్యాపొ ని మైంటైన్ చేస్తూ వైసీపీ పార్టీని, జగన్ ని మబ్బుల్లో ఉంచారంటూ వైసీపి అనుకూల మీడియా జగన్ కోటరీపై వెలుగెత్తిచాటుతోంది.
ఇప్పటికి వీరి మాటలు జగన్ వింటున్నారు, ఇకనైనా వీరిని జగన్ పక్కనబెడితేనే వైసీపీ కి మనుగడ ఉంటుంది అంటూ మొహమాటం లేకుండా చెబుతుంది.