సీతారామం చిత్రంలో దుల్కర్ సల్మాన్ తో కలిసి అందంగా రొమాంటిక్ గా కనిపించిన మృణాల్ ఠాకూర్ ని సౌత్ ప్రేక్షకులు తెగ ఇష్టపడిపోయారు. హాయ్ నాన్న చిత్రంతో మృణాల్ సౌత్ ఆడియన్స్ కి మరింతగా దగ్గరైంది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొట్టేసి ఇంకాస్త బలంగా పాతుకుపోదామని కలలు కన్న మృణాల్ కి ఆ సినిమా రిజల్ట్ కాస్త నిరాశపరిచింది.
సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ హడావిడి చేసే మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్కి 2898 AD చిత్రంలో అతిధి పాత్రలో మెరిసింది. తాజాగా మృణాల్ ఠాకూర్ రొమాన్స్ పై చాలా రొమాంటిక్ గా మాట్లాడింది.
తన దృష్టిలో రొమాన్స్ అనేది చాలా చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన గురించి ఎక్కువగా కేర్ తీసుకోవడం, మన ఆలోచనలతో ఉండడం అనేది గొప్ప రొమాంటిక్ చర్యగా నేను భావిస్తాను. చిన్న టచ్ చాలు రొమాన్స్ పుట్టడానికి అంటూ మృణాల్ రోమాన్స్ పై రొమాంటిక్ గా స్పందించింది.