ఏ స్టార్ హీరో అయినా.. టాప్ లో ఉన్నంతసేపు ప్రేక్షకులు గొప్పగా ఆరాధిస్తారు. అదే ఓ హీరో కి డిజాస్టర్ వచ్చింది అంటే ఆయన నెక్స్ట్ సినిమాపై మార్కెట్ పరంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. ప్రేక్షకుల్లోనూ అనుమానమొస్తుంది. కానీ ప్రభాస్ విషయంలో అలా జరగట్లేదు. అటు ట్రేడ్ అటు అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరైనా ప్రభాస్ ని వదలడం లేదు.
బాహుబలి తర్వాత సౌత్ ప్రేక్షకులు మొదలు ఓవర్సీస్ ఆడియన్స్ వరకు, ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ప్రభాస్ ని ఆరాధించే తీరు ఆయన ప్రతి సినిమా ఓపెనింగ్స్ లోను ప్రూవ్ అవుతూనే ఉంది. బాహుబలి భీబత్సం తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలు నిరాశపరిచినా అవి మాత్రం ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించాయి.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా నిరాశపరిచిన సినిమాలకు కూడా విపరీతమైన హైప్ తో భారీ ఓపెనింగ్స్ రావడం మాములు విషయం కాదు. ఆ మూడు డిజాస్టర్స్ తర్వాత వచ్చిన సలార్ పై ప్రేక్షకులు ఎంతగా ఇంట్రెస్ట్ చూపించారో అనేది సలార్ ఓపెనింగ్స్ చూస్తే తెలుస్తోంది. సలార్ ఓపెనింగ్స్ కి, కలెక్షన్స్ కి హిందీ హీరోలు కూడా షాకయ్యే ఉంటారు. ఇక ఇప్పుడు కల్కితో మరోసారి ప్రభాస్ తన స్టామినా చూపించాడు. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు కల్కి బాక్సాఫీసు జోరు మాములుగా లేదు.
బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెచ్చుకోలేని ఓపెనింగ్స్ కల్కి తో ప్రభాస్ తెచ్చాడు. నార్త్ ఆడియన్స్ కి ప్రభాస్ ఎప్పుడో దేవుడయ్యాడు. అందుకే ప్రభాస్ ప్రతి సినిమా నార్త్ లో కలెక్షన్స్ పరంగా అదరగొడుతూనే ఉంది. ఈ రేంజ్ లో ప్రభాస్ కి అభిమానులు ఏర్పడడం మాములు విషయం కాదు. మరి ఇలాంటి ఫీట్ ని మరే హీరో అయినా సాధించగలడా.. ప్రభాస్ ని టచ్ చేయగలడా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ ఛాలెంజ్ చేస్తున్నారు.