గత ప్రభుత్వంలో పదవుల కోసం వైసీపీ కి భజన చెయ్యడమే కాకుండా.. జగన్ ని కాకా పట్టేందుకు సినిమాల్లో స్నేహితుడైన పవన్ కళ్యాణ్ విషయంలో నోరు పారేసుకుని, ఇప్పుడు వైసీపీ ఓడిపోయాక తమతప్పులు తెలుసుకుని పార్టీకే కాదు రాజకీయాలకే రాజీనామా చేసాడు ఓ కమెడియన్. మరో కమెడియన్ ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తాడా అని అందరూ ముఖ్యంగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఆ కమెడియన్ ఎవరో అందరికి తెలుసు, యాక్టర్ ఆలీ.. వైసీపీ లో చేరి ఎలక్ట్రానిక్ మీడియా పదవిని అనుభవించాడు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడి.. జగన్ వైసీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో రాజాకీల పరంగానే కాదు సినిమాల్లో కూడా తన కెరీర్ ఆగిపోతుంది అని భయపడి ఆలీ వైసీపీకి రాజకీయాలకి రాజీనామా చేసేసాడు. మరి అలీ దారిలోకొచ్చేసాడు. మరొకరు లైన్ లోకి రావాలంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అదే పోసాని కృష్ణమురళి. జగన్ కి భజన చెయ్యడం వరకు ఓకె .. అలాగని పవన్ కళ్యాణ్ కేరెక్టర్ ని దిగజారి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ సెట్స్ లో అవమానపడ్డాను అని చెప్పడం, చంద్రబాబు ని విమర్శించడం, లోకేష్ ని నానా మాటలనడం అబ్బో పోసాని గత ఐదేళ్లుగా మాములుగా చెలరేగిపోలేదు.
మరి ఇప్పడు వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలయ్యింది. అప్పటినుంచి పోసాని గురించి పవన్ ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు పోసాని ఏం మాట్లాడితాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అలీ కాస్త ఆలస్యంగా అయినా దారిలో కొచ్చి వైసీపీ కి రాజీనామా చేసాడు. అయినా అలీ ని మా పవన్ తన సినిమాల్లో పెట్టుకోడు. ఇక ఇప్పుడు పోసాని వంతు అంటూ మాట్లాడుకుంటున్నారు పవన్ అభిమానులు.