వరలక్ష్మి శరత్ కుమార్ ముంబై కి చెందిన ఆర్ట్ గ్యాలరీ ని నడిపిస్తున్న నికోలాయ్ సచ్ దేవ్ ని వివాహం చేసుకోబోతుంది. రెండు నెలల క్రితమే సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ ని సైలెంట్ గా చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లికి మాత్రం అతిరథమహారధులని ఆహ్వానించడం చర్చనీయంశమైంది.
తమిళనాడు సీఎం స్టాలిన్ దగ్గర నుంచి కోలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ రజిని, సూర్య దగ్గర నుంచి హీరోయిన్స్ నయనతార వరకు, టాలీవుడ్ లోను ఆమె పని చేసిన హీరోల దగ్గర నుంచి దర్శకులు, హీరోయిన్ సమంత ఇలా చాలామందిని స్పెషల్ గా పెళ్ళికి ఆహ్వానాలు పలుకుతుంది. నందమూరి బాలకృష్ణ కి, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా వరలక్ష్మి కాబోయే భర్త, తన తండ్రి శరత్ కుమార్, స్టెప్ మదర్ రాధికతో కలిసి వెళ్లి ఆహ్వానిస్తుంది.
అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ తనకు కాబోయే భర్త సచ్ దేవ్, తండ్రి శరత్ కుమార్, ఇంకా రాధికతో కలిసి పీఎం నరేంద్ర మోడీని కలిసి తన పెళ్ళికి ఆహ్వానించడం హాట్ టాపిక్ అయ్యింది. గత నెల రోజులుగా పేరు పేరునా అందరిని పెళ్ళికి ఆహ్వానిస్తున్న వరలక్ష్మి.. తాజాగా మోడీ కి కూడా ఆహ్వానించింది. రాధికా-శరత్ కుమార్ లు బీజేపీ పార్టీలో ఉన్నారు. అలా పెళ్ళికి ఆహ్వానించడానికి ఫ్యామిలీతో సహా వరలక్ష్మి మోడీ దగ్గరకు వెళ్ళింది.