Advertisementt

RTV ఆఫీస్ పై ED రైడ్?

Sat 29th Jun 2024 12:44 PM
rtv  RTV ఆఫీస్ పై ED రైడ్?
ED Raid on RTV Office? RTV ఆఫీస్ పై ED రైడ్?
Advertisement
Ads by CJ

పలు ఆరోపణలతో TV 9 నుంచి బయటికెళ్ళిపోయిన రవిప్రకాష్ గత ఏడాది వరకు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ తన పేరుమీదనే ఓ ఛానల్ ని స్టార్ట్ చేసాడు. RTV అంటూ రవి ప్రకాష్ మరోసారి యాక్టీవ్ అయ్యాడు. 

రవిప్రకాష్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున ED  కేసులు ఉన్నావని అందరికీ తెలిసిందే. ఆఫ్రికాలో వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు హవాలలో తరలించడాన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. RTV ఖర్చులు మొత్తం క్యాష్ రూపంలో ఖర్చు పెడుతున్నారు.

అయితే ఈ విషయం బయటకు పొక్కటంతో RTV పై ED అధికారులు రైడ్ చేశారు. రవి ప్రకాష్ గత సంవత్సర కాలంగా Rtv ఎలా నడుపుతున్నారు. క్యాష్ లో RTV కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనే లెక్కలు బయటకు తీస్తున్నారు. 

RTV కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ సైతం బిల్లులు లేవు అని అన్ని కాష్ లోనే చెల్లింపులు జరిగినట్లు ED అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. RTV లో ఎంప్లాయిస్ జీతాలు సైతం క్యాష్ లోనే ఇస్తున్న విషయాలు ED అధికారులు.. రెండు రోజులుగా గోప్యంగా విచారణ చేస్తు లెక్కలపై ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. 

ఈ విషయం బయటికి పొక్కడంతో రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడంటున్నారు. ఆఫీస్ లో ఓ ఫ్లోర్ అంతా, ఏడున్నర కోట్ల నగదు ED అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. 

ED Raid on RTV Office?:

RTV

Tags:   RTV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ