నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయలతోనే కాదు, హ్యట్రిక్ ఎమ్యెల్యే గా గెలిచి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. బావ సీఎం గా, అల్లుళ్ళు ఒకరు మంత్రి, మరొకరు ఎంపీగా ఉండడంతో ఆయన సంతోషానికి అవధులు లేవు. మరోపక్క ఎన్నికలు పూర్తి కావడంతో బాలయ్య NBK 109 షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
బాలయ్య అభిమానులని కొడతారు కొడతారు అనడం కాదు.. అప్పుడప్పుడు ఆయనకి కోపమొస్తే అభిమాని చెంప పగలగొట్టడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. అభిమానులు బాలయ్య మమ్మల్ని అలా చెయ్యి పెట్టి కొట్టినా ఇష్టమే అని చెబుతూ ఉంటారు. ఆయన్ని దగ్గరగా చూసిన వారు బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం.. అందరితో ఎంతగా కలిసిపోయి సంతోషంగా ఉంటారో కోపమొస్తే అలానే రియాక్ట్ అవుతారంటూ మాట్లాడతారు.
తాజాగా కర్నూలు జిల్లాలో బాలకృష్ణ ను ఓ అభిమాని కలిసాడు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ బాలకృష్ణ ను కలవగా ఆయన అభిమానితో మట్లాడుతూ ఆ తర్వాత ఆ అభిమానితో కలిసి భోజనం చేసిన వీడియోస్ ని స్ప్రెడ్ చేస్తూ ఇలా ఏ హీరో అయినా అభిమానులతో కలిసి భోజనం చేస్తారా మా బాలయ్య చేస్తారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
అంతేకాదు బాలయ్యని కలిసిన అభిమాని సజ్జద్ మాట్లాడుతూ.. తాను హీరో నందమూరి బాలకృష్ణ గారి వీర అభిమానిని అందులో భాగంగానే ఇవాళ తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారిని కలవడం జరిగిందన్నారు. అంతే కాకుండా అయనతోపాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు చెప్పారు.