నిన్నటివరకు దేశ రాజధాని ఢిల్లీ విపరీతమైన ఎండలతో అతలాకుతలం అయ్యింది. వేడి గాలులు, విపరీతమైన టెంపరేచర్ తో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నీటి ఎద్దడితో అల్లాడిపోయారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు నీటి కరువుతో ఢిల్లీ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఎండల కారణంగా ఉన్న నీరు కూడా మరిగిపోయింది, ఆవిరైపోయింది. తాగడానికి నీళ్లు లేక, ఉక్కపోతకు తాళలేక ప్రజలు ఆకాశం వైపు చూసారు.
ఇటివరకు ఢిల్లీ వాయు కాలుష్యంతో అల్లాడిన ప్రజలు ఈ ఏడాది విపరీతమైన ఎండలకు బలయ్యారు. వేడి గాలుల వలన పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వర్షాలతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీ ని వర్షం అతలాకుతలం చేసేసింది. ఈదురు గాలులతో వర్ష భీభత్సంతో ఢిల్లీ జలమయమైంది.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఈదురు గాలులకు ఎయిర్పోర్టు రూఫ్ కూలిపోయింది. చెక్ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేసారు. రూఫ్ సపోర్టు పిల్లర్.. కార్లపై విరిగిపడడమే కాదు.. ఆ సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరు మరణించారు. శిధిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు. మరి నిన్నటివరకు ఎండలతో అల్లాడిన ఢిల్లీ ప్రజలు నేడు ఈదురు గాలులతో కూడిన వర్షాలతో తంటాలు పడుతున్నారు. ఎదైనా ఢిల్లీ కి అతి వృష్టే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.