మెగాస్టార్ చిరంజీవి స్పీడు మాములుగా లేదు.. యంగ్ హీరోలయినా షూటింగ్స్ కి కాస్త విరామమిచ్చి వెకేషన్స్ అంటూ వెళుతున్నారు, ఆ నెప్పి ఈ నెప్పి అని షూటింగ్స్ కి బ్రేకిస్తున్నా మెగాస్టార్ చిరు మాత్రం ఈ వయసులోనూ షూటింగ్ కి విరామమే లేకుండా కష్టపడుతున్నారు. ప్రస్తుతం చిరు వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు.
సూపర్ ఫిక్షనల్ జోనర్ లోనే సోషియో ఫాంటసీ కథాంశంతో విశ్వంభర తెరకెక్కుతుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి టార్గెట్ గా రూపొందడమే కాదు అప్పుడే 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే చిరు కేవలం విశ్వంభర అంటూనే కూర్చోకుండా మరిన్ని మూవీస్ ని లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారట.
ఇప్పటికే మచ్చ రవి కథ ఓకె చేసుకున్న చిరు దానికి సరైన దర్శకుడు కోసం వెయిట్ చేస్తున్నారు. మరోపక్క దర్శకులు చెప్పే కథలను వింటూ అందులో ఓ రెండు కథలను ఫైనల్ చేసారని తెలుస్తోంది. అందులో చందు మొండేటి, హరీష్ శంకర్ దర్శకత్వాల్లో మెగాస్టార్ చిరు నటించే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి మెగాస్టార్ విశ్వంభర తర్వాత ఏ దర్శకుడితో సినిమా స్టార్ట్ చేస్తారో చూడాలి.