మెగా చిన్న కోడలు అంటే హీరోయిన్ లావణ్య త్రిపాఠి అసలు ఏం ఆలోచిస్తుంది. నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత ఆమె నటించిన ఓ వెబ్ సీరీస్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి భర్త తో కలిసి జాలి గా ట్రిప్స్ వెయ్యడం నేచర్ ని ఎంజాయ్ చెయ్యడం అప్పుడప్పుడు అత్తగారితో కలిసి వంటలు, ఆవకాయ్ పచ్చళ్ళు లాంటివి పెట్టడం చేస్తుంది.
పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి నటనని కొనసాగిస్తానని చెప్పకనే చాలాసార్లు చెప్పింది. ఇప్పటికే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన లావణ్య త్రిపాఠి ఓటీటీ పైకి వచ్చేసింది. వెబ్ సీరీస్ లు చేస్తుంది. మరి వరుణ్ తేజ్ తో వివాహమయ్యి మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు.
తరచూ సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫొటోస్ ని షేర్ చేసే లావణ్య త్రిపాఠి తాజాగా వదిలిన ఫోటో చూస్తే మాత్రం మెగా చిన్న కోడలు ఏం ఆలోచిస్తుందో అని నెటిజెన్స్ కామెంట్స్ చేసేలా ఉంది. మరి లావణ్య కెరీర్ పై ఎలాంటి ఆలోచన చేస్తుందో అని ఆమె అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.