ఇప్పటికి ఉప్పెన బ్యూటీ అంటూనే సంబోధిస్తున్న కృతి శెట్టి ఆ ఉప్పెన అంత హిట్ మాత్రం ఇంతవరకు టాలీవుడ్ లో దక్కలేదు. ఈమధ్యన కృతి శెట్టి నటించిన మనమే చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రంతో సక్సెస్ అందుకుని మళ్ళి బిజీ అవ్వాలనే కృతి శెట్టి కోరికని మనమే రిజల్ట్ డిజ్ పాయింట్ చేసింది.
ఒకప్పుడు చాలా నార్మల్ గా పద్దతి గల కేరెక్టర్స్ లో కనిపించిన కృతి శెట్టి ఈమధ్యన గ్లామర్ వైపు టర్న్ అయ్యింది. సోషల్ మీడియాలోను స్పెషల్ గ్లామర్ ఫోటో షూట్ తో యూత్ మనసు కొల్లగొడుతున్న కృతి శెట్టి మనమే చిత్రంలోనూ గ్లామర్ పాత్రతో బాగుంది అనిపించింది.
తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మాత్రం క్యూట్ కృతి శెట్టి అని అనకుండా ఉండలేరు. అంత చక్కటి అందంతో కృతి శెట్టి వైట్ ఫ్రాక్ లో క్లోజప్ షాట్స్ లో కనిపించింది. మరి మనమే తర్వాత కృతి శెట్టికి అవకాశమిచ్చే ఆ తెలుగు హీరో ఎవరో అనేది వేచి చూడాల్సిందే.