ఫైనల్ గా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ పై అప్ డేట్ ఇచ్చి మెగా అభిమానులకి ఊరటనిచ్చారు. దాదాపుగా మూడేళ్ళుగా గేమ్ చెంజర్ ని తెరకెక్కిస్తున్నారు. అనుకోకుండా గేమ్ చేంజర్ తో పాటుగా ఆయన ఇండియన్ 2 మూవీ ని కూడా డైరెక్ట్ చెయ్యాల్సి రావడంతో గేమ్ చేంజర్ షూటింగ్ లేట్ అవుతూ.. ఇప్పటికి రిలీజ్ డేట్ ఇవ్వకుండా సస్పెన్స్ లోనే పెట్టాల్సి వచ్చింది.
ఇక దిల్ రాజు మాత్రం శంకర్ శాటిలైట్ లాంటి వారు ఆయన గేమ్ చేంజర్ రిలీజ్ పై ఎప్పుడు సిగ్నల్ ఇస్తారో చెప్పలేమంటూ చేతులెత్తేశారు. రామ్ చరణ్ అక్టోబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అని చెప్పినప్పటికీ అది దివాళి కి మారింది అంటున్నారు. అసలు గేమ్ చేంజర్ విషయంలో దర్శకుడు శంకర్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు.
తాజాగా శంకర్ ఇండియన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ చెంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే బాలన్స్ ఉంది. ఆ బాలన్స్ షూట్ ని ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక పూర్తి చేస్తానని చెప్పడమే కాదు ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ ని లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు బట్టి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తామని, వీలైనంత త్వరగా ఇవన్నీ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తామని గేమ్ చేంజర్ రిలీజ్ పై శంకర్ క్లారిటీ లేని అప్ డేట్ ఇచ్చినా.. మెగా ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు.