నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898 AD చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ షోస్ నుంచే కల్కి సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ విశ్లేషకులు కల్కి కి సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ రేటింగ్స్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులని మరింత సంతోషపెట్టేసింది. ప్రభాస్ అభిమానులు కల్కి కి వస్తున్న ప్రేక్షకాదరణ చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
సంగీతం, BGM, ఫస్ట్ కాస్త మైనస్ అనిపించుకుంటున్నా కల్కి కి ఇంటర్వెల్ బ్లాక్ అలాగే సెకండ్ హాఫ్, ఇంకా క్లైమాక్స్ తో పాటుగా ప్రభాస్, అమితాబచ్చన్ కేరెక్టర్ ఇవన్నీ ప్లస్ లుగా నిలవగా ప్రభాస్, అమితాబ్ నటనకు ఆడియన్స్ ముగ్దులైపోతున్నారు. కమల్ హాసన్, అమితాబ్ ఎవరికి వారే నటన విషయంలో అద్భుతం అని.. లోపల వేరే ప్రపంచం చూపించారని కామెంట్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కొడుకు ప్రభాస్ సినిమాని ప్రమోట్ చేస్తూ కల్కి టి షర్ట్ వేసుకుని మరీ సినిమాని వీక్షించడానికి థియేటర్స్ కి వెళ్లడం హైలెట్ అయ్యింది. పవన్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ కొడుకుతో కలిసి సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. మేమంతా కల్కి అభిమానులం, చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ అరిచి గోల చేసాం. అలా థియేటర్స్ లో గోల చేసినందుకు ఒక వారం రోజులైనా మా గొంతులు పనిచేయవేమో. ఈ రోజు ఉదయమే కల్కి మార్నింగ్ షో చూశాం. మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి వెళ్లి ఖచ్చితంగా కల్కి సినిమా చూడండి.. అని తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు రేణు దేశాయ్.