స్టార్ హీరోల కొడుకులైనా, మరెవ్వరైనా స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ విడుదలవుతున్నాయి అంటే వాటిని ప్రత్యేకంగా మొదటి షో చూసేందుకు ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు. బాలయ్య సినిమాలని ఆయన కొడుకు మోక్షజ్ఞ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. ఇక పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ కూడా చాలాసార్లు చాలా సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాడు.
తాజాగా అకీరా నందన్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రాన్ని కల్కి టి షర్ట్ వేసుకుని మరీ వీక్షించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి చిత్రాన్ని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇలా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కూడా ఉత్సాహంగా అభిమానులు, ప్రేక్షకుల మధ్యలో కల్కి ని వీక్షించడం హైలెట్ అయ్యింది.
అకీరా అలా కల్కి టి షర్ట్ వేసుకుని సినిమాని ప్రమోట్ చేస్తూ సినిమా చూసేందుకు రావడంతో ఆ విజువల్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తూ అకీరా కూడా మనోడే అంటూ కామెంట్స్ పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. ఇక అకీరా ని కల్కి థియేటర్ దగ్గర చూసి అఖిల్ బ్రో ఒక్క స్టిల్ ప్లీజ్ అంటూ కెమెరామ్యాన్స్ వెంట బడ్డారు.