Advertisementt

కల్కి 2898 AD: ప్రభాస్ కిది బెస్ట్ ఇంట్రో

Wed 26th Jun 2024 10:12 PM
nag ashwin  కల్కి 2898 AD: ప్రభాస్ కిది బెస్ట్ ఇంట్రో
Nag Ashwin confirms Kalki part 2 కల్కి 2898 AD: ప్రభాస్ కిది బెస్ట్ ఇంట్రో
Advertisement
Ads by CJ

కల్కి 2898 AD చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంది అంటూ మొదటి నుంచి ప్రచారం జరగడమే కానీ.. ఎక్కడా కల్కి మేకర్స్ ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది లేదు. కమల్ హాసన్ నా రోల్ ఈ చిత్రంలో 20 నిముషాలు ఉంటుంది అన్నప్పుడే ఖచ్చితంగా కల్కి కి పార్ట్ 2 ఉంటుంది అని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ మేకర్స్ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

అసలు కల్కి పార్ట్ 2 ఉంటుందా.. అనే సస్పెన్స్ వీడలేదు. సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది.. ఇక థియేటర్స్ లో కల్కి పార్ట్ 2 పై ఉన్న సస్పెన్స్ వీడుతుందేమో అనుకునేలోపు దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 ఉంది అని కన్ ఫర్మ్ చేసారు. అంతేకాకుండా మరికొద్దిసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తుంది. ప్రభాస్ కి ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అవుతుంది, అలాగే కల్కి పార్ట్ 1 క్లైమాక్స్ లో ఓ సర్ ప్రైజ్ సాంగ్ కూడా ఉంటుంది అంటూ నాగ్ అశ్విన్ అంచనాలు పెంచేశారు. 

ఇక కల్కి లో విజయ్ దేవరకొండ-దుల్కర్ సల్మాన్ లు గెస్ట్ రోల్స్ చేసారంటూ ఇన్స్టా లైవ్ లో సర్ ప్రైజ్ ఇస్తూ ప్రభాస్-నాగ్ అశ్విన్ ఇద్దరూ ఆ ఇరిద్దరికి థాంక్స్ చెప్పారు. 

అంతేకాకుండా కల్కి 2898 AD పార్ట్ లో 80 శాతం వరకు యాక్షన్ పార్ట్ ఉంటుంది అని పార్ట్ 2 ని కన్ ఫర్మ్ చేస్తూ నాగ్ అశ్విన్ కల్కి 2898 AD పై మరిన్ని అంచనాలు పెంచారు. 

Nag Ashwin confirms Kalki part 2:

Nag Ashwin confirmed that Dulquer Salmaan and Vijay Deverakonda are a part of Kalki 2898 AD

Tags:   NAG ASHWIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ