మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి 2898 AD చిత్ర టాక్ కోసం సోషల్ మీడియా సిద్ధమైంది. గత వారం రోజులుగా సోషల్ మీడియా మొత్తం కల్కి మ్యానియాతో మునిగిపోయింది. కల్కి కల్కి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పలవరిస్తున్నారు. ఇంకొద్ది గంటల సమయమే ఉంది కల్కి రాకకై.
ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ పై కల్కి గా చూస్తూ ఆ క్షణాలని అనుభవించేందుకు అభిమానులు సిద్దమైపోయారు. ఓవర్సీస్ లో ఈరోజు అర్ధరాత్రి 1 గంటకే కల్కి 2898 AD షోస్ లో మొదలైపోతాయి. మరి సినిమా చూస్తూ ఆడియన్స్, అభిమానులు ఊరుకోరుగా.. లైవ్ అప్ డేట్స్ అంటూ వెబ్ సైట్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అలాగే సోషల్ మీడియాలో కల్కి చిత్రం గురించిన పోస్ట్ లు పెడుతూ.. ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరింది, కల్కి ఇలా ఉంది, అలా ఉంది అంటూ టాక్ స్ప్రెడ్ చేసేస్తారు.
ఆ ఓవర్సీస్ టాక్ కోసం ఇక్కడి ఇండియాలోని ప్రభాస్ ఫ్యాన్స్ కాచుకుని కూర్చుంటారు. మిడ్ నైట్ లో కల్కి షోస్ లేవు. సో అభిమానులంతా సోషల్ మీడియాలో రాబోయే ఓవర్సీస్ టాక్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. మరేందుకు లేటు.. గంటలు, నిముషాలు, సెకన్లు లెక్కించేస్తూ కొద్ధి సేపు వెయిట్ చేస్తేపోలా.. కల్కి టాక్ వచ్చేస్తుంది.