Advertisement
TDP Ads

PR: పవన్ ది ఉత్సాహమా.. అత్యుత్సాహమా?

Wed 26th Jun 2024 07:19 PM
paawan kalyan  PR: పవన్ ది ఉత్సాహమా.. అత్యుత్సాహమా?
Pawan Kalyan is so aggressive PR: పవన్ ది ఉత్సాహమా.. అత్యుత్సాహమా?
Advertisement

2024 ఎలక్షన్స్ లో కూటమి విజయానికి కీలక పాత్ర పోషించింది పవన్ అనడంలో సందేహం లేదు. అయితే ఆ విజయం తర్వాత తన పార్టీ నేతలకు కొన్ని మంత్రిత్వ శాఖలు వచ్చేలా చూసుకుని తాను మాత్రం బ్యాక్ టు సినిమాస్ వెళ్లిపోవాలనుకున్నారు పవన్ కళ్యాణ్. వందల కోట్ల పెట్టుబడితో తననే నమ్ముకుని సినిమాలు చేస్తోన్న నిర్మాతలకు న్యాయం చేసి, వాటిని పూర్తి చేసి ఆపై మంత్రి వర్గ విస్తరణ సమయంలో వస్తానంటూ చెప్పారట. 

కానీ కథ అడ్డం తిరిగింది. అనూహ్యమైన విజయం అనుకోని పరిస్థితిని కలిపించింది. అసాధారణమైన ప్రాధాన్యాన్ని తీసుకొచ్చేసింది. కేంద్ర పెద్దల ఒత్తిడి, రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మంత్రిగా పలు శాఖలు చేపట్టిన పవన్ సినిమాల సంగతి మర్చిపోయారు. తనకు కేటాయించిన శాఖల అవగాహనపై తలకు మించిన భారంతో తంటాలు పడుతున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో సమానంగా చూస్తూ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఆయన అభిమానులని ఆనందింపజేస్తూ ఉండొచ్చు. కానీ అన్ని బాధ్యతల నిర్వహణలో అనుభవం లేని పవన్ కళ్యాణ్ ఎంత సతమతమవుతూ.. ఉన్నారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికైతే వరసగా సమీక్షలు నిర్వహిస్తూ, తన పదవికి న్యాయం చెయ్యాలనే తపన పడుతూ.. శరవేగంగా పనులు చేస్తూ వస్తున్నారు. కానీ ఇదే వేగం ఆయన కొనసాగించగలరా, ఐదేళ్లు ఇదే స్పీడు చూపించగలరా అనేదే అందరిలో వ్యక్తమవుతోన్న సందేహం. 

సోషల్ మీడియా సంగతి తెలిసిందేగా. కొత్త పిచ్చోడు పొద్దెరగడు, మొదటిలో ఉన్న మోజు చివరిదాకా ఉండాలిగా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నానంటూ గెటప్ మార్చిన పవన్ కళ్యాణ్ తన పని తీరుని మాత్రం మార్చకుండా, మారిపోకుండా ఇలాగే కొనసాగిస్తూ వెళ్ళాలని కోరుకుందాం. పవన్ ది ఉత్సాహమా.. అత్యుత్సాహమా అని కామెంట్ చేసే వాళ్ళకు ఆయన పనితీరుతోనే సమాధానం చెప్పాలని ఆశిద్దాం. 

Pawan Kalyan is so aggressive:

Paawan Kalyan

Tags:   PAAWAN KALYAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement