నాగ్ అశ్విన్ మేకింగ్ స్టయిల్ కి కల్కి విడుదల కాకముందే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కల్కి లోని పాత్రల తీరు తెన్నులు, ఆ పాత్రల లుక్స్, కల్కి 2898 AD ట్రైలర్ చూసాక ఒక అంచనాకి రావడమే కాదు.. రాజమౌళి తర్వాత నాగినే అంతటి కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అని పొగుడుతున్నారు. కల్కి పై నాగ్ అశ్విన్ తెప్పించిన హైప్ పై ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక బుజ్జి ఈవెంట్ నిర్వహించిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత ముంబై లో ఒక మీడియా మీట్ నిర్వహించారు. తప్ప మరో ప్రమోషనల్ ఈవెంట్ కల్కి కి చెయ్యలేదు. అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, ఆ తర్వాత హైదరాబాద్ లోనే కల్కి 2898 AD ఈవెంట్ జరుగుతుంది అన్నారు అది లేదు. అలాగే కనీసం కల్కి టీం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
హైదరాబాద్ లో కల్కి ఈవెంట్ పెడతారని ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు. కానీ మేకర్స్ అభిమానులని డిజ్ పాయింట్ చేసారు. అసలు మీడియా ఇంటరాక్షన్ లేకుండానే కల్కి కి ఇంత బజ్ తెప్పించిన నాగ్ అశ్విన్ ని మీడియా మిత్రులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. నాగ్ అశ్విన్ చాలా గ్రేట్.. టాలీవుడ్ హీరో అయ్యుండి ప్రభాస్ తో కల్కి సినిమా చేయించి తెలుగులో ఒక్క మీడియా మీట్ లేకుండా కల్కి సినిమాకి ఈ రేంజ్ బజ్ తీసుకురావడం మాములు విషయం కాదు అంటున్నారు.
సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్స్ చూసాక వారు నాగ్ అశ్విన్ ని పొగుడుతున్నారా, లేదంటే తిడుతున్నారా అనే డౌట్ రాక మానదు. మీడియా తో ఎలాంటి కనేక్షన్ లేకుండా కల్కి పై ఇంకా క్రేజ్ తీసుకురావడం పై నాగ్ అశ్విన్ ని అభినందించకుండా ఉండలేకపోవుతున్నారు సదరు మీడియా మిత్రులు.