డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి దీక్ష తీసుకున్నారు. వారాహి అమ్మవారి కోసం 11 రోజులు దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లో చాల అంటే చాలా బిజీగా ఉన్నారు. తన శాఖల అధికారులకి దిశానిర్దేశం చేస్తూ కార్యసాధకుడిలా పని చేస్తున్నారు. మరోపక్క జులై 1 నుంచి ఆయన పిఠాపురం నియోజవర్గంలో పర్యటించనున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంత బిజీగా ఉంటే ఆయన సినిమా లొకేషన్స్ కి రావడం పక్కా లేట్ అయ్యేలా ఉంది. ఆయన కోసం హరి హరి వీరమల్లు నిర్మాత రత్నం, OG నిర్మాత దానయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం మిగతా టాలీవుడ్ నిర్మాతలతో కలిసి పవన్ కళ్యాణ్ తో మీటయ్యేందుకు ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా వెళ్లారు.
మరి అక్కడ ఆయన షూటింగ్స్ కి ఎప్పుడు వస్తారో అని అడిగే ధైర్యం ఏ ఒక్క నిర్మాత అయినా చేసారో, లేదో.. కానీ.. పవన్ మాత్రం తన పార్ట్ షూటింగ్స్ ఎప్పుడు పూర్తి చేస్తారో అని ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా సెట్లు వేసుకుని, పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. పవర్ లో ఉన్న పవన్ అక్కడ సమస్యల పరిష్కారానికి పాకులాడుతున్నారు. ఆయన నిర్మాతలకి ఎప్పుడు సాయమందిస్తారో వేచి చూడాల్సిందే.